NTV Telugu Site icon

Vidudala Rajini : దమ్ముంటే తన పాలనలో చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలి

Vidudala Rajini

Vidudala Rajini

కృష్ణా జిల్లా గుడివాడలో రూ. 10 కోట్ల 28 లక్షలతో నిధులతో నూతనంగా నిర్మించిన 100పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ 2ను ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి మంత్రి విడుదల రజనీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విడదల రజనీ మాట్లాడుతూ… దమ్ముంటే తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలని సవాల్ అన్నారు. ఆరోగ్యశ్రీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్ కు లేదని ఆమె ధ్వజమెత్తారు. మ్యానిఫెస్టో అంటూ నాటకాలు ఆడుతున్న చంద్రబాబు.. నమ్మకం కోల్పోయిన చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరన్నారు. ఇచ్చిన హామీలు పూర్తి చేసిన జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారని, చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసిన గుడివాడలో కొడాలి నానిను ఓడించడం అసాధ్యం… టీడీపీ నేతలు డైలాగులుకే పరిమితమన్నారు. ప్రజలు, సీఎం జగన్ తో పాటుగా కొడాలి నానికు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు.

Also Read : Traffic Alert: ట్రాఫిక్ అలర్ట్.. నేటి నుంచి ఈ నెల 10 వరకు ఆంక్షలు

గొప్ప రోజున హాస్పిటల్ ప్రారంభించి వైఎస్సార్‌కు నివాళి అర్పించామన్నారు. వైసీపీ హయాంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీతో లబ్ది పొందాయన్నారు. వైఎస్సార్‌ ఆశయాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య రంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ… వైద్యుడు కాబట్టే సీఎంగా వైద్య రంగంలో వైఎస్సార్ ఎన్నో మార్పులు తెచ్చి.. దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కృషితో ఆరోగ్య శ్రీ, 108, 104 వైద్య సేవలు మారుమూల గ్రామాలకు చేరుతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో 108, 104 వాహనాలు షెడ్డుకే పరిమితమన్నారు. వైఎస్సార్‌ లేకుంటే ఆరోగ్యశ్రీ అనే పథకం రాకా లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకొని 10 కోట్ల28 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Malladi Vishnu : ఆంధ్రుల ఆరాధ్య దైవం వైఎస్ఆర్