Congress Worker : కర్ణాటకలోని ధర్వాడ్ జిల్లాలో ఓ వివాహ వేడుక జరుగుతున్నది. ఇందులో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్త ఓ డ్యాన్స్ చేస్తున్న మహిళపై కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో వివాదాస్పదంగా మారింది. స్టేజ్‌పై ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ ఆహూతులను అలరిస్తున్నది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆమెతో కలిసి జోరుగా స్టెప్పులేయడం ప్రారంభించాడు. ఈ వీడియోలో హుబ్లీకి చెందిన శివశంకర్ హంపణ్ణ అనే కాంగ్రెస్ కార్యకర్త మహిళ పక్కన డ్యాన్స్ చేస్తూ ఆమెపై డబ్బు విసురుతున్నాడు.
Read Also: Bichagadu : ఇక ఆ నగరంలో అడ్డుక్కుంటే కేసులే.. ఆదేశాలిచ్చిన కమిషనర్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికార ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ మహిళకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన సిగ్గుచేటని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేశ్ టెంగింకై అన్నారు. ఇలాంటి వ్యక్తులకు డబ్బు విలువ తెల్వదని..ఇలాంటి ఘటనల వల్లే కాంగ్రెస్ సంస్కృతి ఏంటో అర్థమవుతోందని విమర్శించారు. ఈ ఘటన మహిళలను పూర్తిగా అగౌరవ పరిచేలా ఉందన్నారు.