NTV Telugu Site icon

Jallikattu bull: ఎద్దుకు బలవంతంగా కోడిని తినిపించిన ఓ వ్యక్తి.. కేసు నమోదు

Bull

Bull

జల్లికట్టు ఎద్దుకు బలవంతంగా తినిపిస్తున్నట్లు చూపించిన వీడియోపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతేాకాకుండా ఆ వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను సేలం జిల్లా చిన్నప్పంపట్టిలో చిత్రీకరించారు. కాగా ఈ వీడియోలో ఒక ఎద్దుకు నోటిలో కోడిని పెట్టి నమలమని బలవంతం చేశారు. అంతేకాకుండా.. ముగ్గురు వ్యక్తులు ఎద్దును గట్టిగా పట్టుకోగా, ఒకరు కోడిని నోటిలో పెట్టడం లాంటివి చేశారు.

Read Also: Boat Tragedy: 14కు చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

పీపుల్ ఫర్ క్యాటిల్ ఎయిమ్ ఇండియా (పీఎఫ్‌సీఐ) వ్యవస్థాపకుడు అరుణ్ ప్రసన్న ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఒక శాఖాహార జంతువు దానికి చికెన్ తినమని బలవంతం చేయడం చాలా తప్పు. ఇది బ్యాడ్ ట్రెండ్ సెట్ చేస్తుందన్న భయం ఒక్కటేనని ఫిర్యాదు తెలిపారు. పోటీలో ఈ ఎద్దు గెలిస్తే చాలా మంది ఎద్దుల యజమానులు ఇలానే చేస్తారన్నారు. కాగా.. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తారమంగళం పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Read Also: Kodali Nani Reaction: నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు..

తమిళనాడులోని పాలమేడులో ప్రతి సంవత్సరం జల్లికట్టు నిర్వహిస్తారు. అందులో భాగంగా.. మంగళవారం జరిగిన పొంగల్ 2024 జల్లికట్టు సీజన్‌లో 14 మంది జంతు శిక్షకులు, 16 మంది ప్రేక్షకులు సహా దాదాపు 42 మంది గాయపడడం గమనార్హం. ఈ జల్లికట్లులో 14 ఎద్దులను అదుపు చేసిన ఉత్తమ జంతు శిక్షకుడికి, అదుపు చేయలేని ఉత్తమ ఎద్దు యజమానికి ‘ముఖ్యమంత్రి కారు’ను బహుమతిగా అందజేశారు.

Show comments