NTV Telugu Site icon

Mumbai: ఓ తల్లి నీకంత తొందరేమీ వచ్చింది. జారావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి

Mumbai

Mumbai

మహారాష్ట్ర రాజధాని ముంబైలో జనసందోహం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ముంబై సిటీకి సంబంధించి రష్ ఎలా ఉంటుందో మనం వీడియోల్లో చూస్తుంటాం. అయితే కొందరు వారు గమ్యానికి వెళ్లేందుకు బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణాలు చేస్తుంటారు. కొన్నిసార్లు రద్దీ కారణంగా జనాలు ట్రైన్ పుట్ పాత్ లపై వేలాడుతూ ప్రయాణిస్తుంటారు. అలాంటప్పుడు ప్రాణాలు కూడా కోల్పోవల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ముంబై లోకల్ ట్రైన్ లో ఓ అమ్మాయి పుట్ పాత్ పై వేలాడుతూ ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Star Hospitals: స్టార్ హాస్పిటల్స్ ప్రారంభం-అందానికి సౌందర్యతిలకమద్దే ‘ఇల్యుమినా’

ఈ వీడియోలో ఓ అమ్మాయి ఫుట్ పాత్ పై వేలాడటం కనిపిస్తుంది. ఆమే పాదాలు సగం బయటే ఉన్నాయి. అంతేకాకుండా ఆమే బరువును బ్యాలెన్స్ చేసుకోవడమే గగనం అంటే.. భుజానికి బ్యాగ్ ఉంది. తాను పడిపోకుండా ట్రైన్ లో ఏదో ఒకదాన్ని పట్టుకుని ఉండగా.. కొంత భాగం మాత్రమే లోపల ఉంది. ఆమే శరీరం మొత్తం బయటనే ఉంది. ఆ రైలు వెళ్తున్నప్పుడు ఆమెకు చాలాసార్లు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టాయి.

Andhra Pradesh: విద్యారంగంలో గేమ్‌ ఛేంజర్‌.. ‘ఎడెక్స్’తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం

అయితే ముంబై లోకల్‌ ట్రైన్ లో ఇలాంటివి కొత్తేం కాదు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తాయి. గతంలో ఒక వ్యక్తి తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రమాదకర వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ముంబై లోకల్‌ ట్రైన్ లో ఆటోమేటిక్ క్లోజింగ్ గేట్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఒక వినియోగదారుడు రాశారు. మరికొందరమో.. ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేయడం మంచిది కాదని తెలుపుతున్నారు.