Bengaluru Traffic: లంచ్ @ ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Traffic jam: దేశంలోని మెట్రో సిటీలైన ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబయి, బెంగళూరూ, హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు సర్యసాధారణం. అయితే సాధారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏమీ చేస్తారు.. ఏముంది.. కొద్దిసేపు వెయిట్ చేస్తాం లేదా.. పాటలు వింటూ ఉంటాం.. ఇంకా ఓపిక లేకపోతే ట్రాఫిక్ జామ్‌పై ప్రభుత్వాలను తిట్టుకుంటాం. కానీ కొందరు క్రియేటివిటీ ఉన్నవారు చాలా తెలివిగా ఆలోచించి ట్రాఫిక్ జామ్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకుంటారు.. ఎలా అంటారా.. ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరూ సిటీలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న బస్ డ్రైవర్ ఇలా చేశాడు.. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న బెంగళూరు మహానగరంలో ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ కూడా పెరిగిపోతోంది. ఎంత పెరిగి పోయిందంటే.. ఒక బస్ డ్రైవర్ ట్రాఫిక్ జామ్ సమయంలోనే లంచ్ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అంత సేపు పట్టింది ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి.
Read Also: Viral Video: క్రేజీ స్టెప్స్‌తో దుమ్మురేపిన బామ్మ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
బస్ డ్రైవర్ తాను తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ను స్పూన్‌తో పూర్తి చేశాడు. తరువాత ప్రశాంతంగా నీరు తాగి తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. అంత సమయం పట్టింది పట్టింది ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్‌లో నిలిచిన బస్సులో డ్రైవింగ్ సీటులో కూర్చొని బస్ డ్రైవర్ లంచ్ చేయడం కనిపిస్తుంది. దీనికి పీక్ ట్రాఫిక్ మూవ్‌మెంట్ ఇన్ బెంగళూరు అనే క్యాప్షన్‌ను యూజర్ జత చేశాడు. ట్రాఫిక్ వల్ల బస్సు డ్రైవర్ ప్రశాంతంగా భోజనం చేసే టైం కూడా దొరకడం లేదని మరో నెట్‌జన్ డ్రైవర్ స్థితిపట్ల సానుభూతి వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..