NTV Telugu Site icon

Bengaluru Traffic: లంచ్‌ @ ట్రాఫిక్ జామ్‌.. వీడియో వైరల్

Traffic

Traffic

Bengaluru Traffic jam: దేశంలోని మెట్రో సిటీలైన ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబయి, బెంగళూరూ, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు సర్యసాధారణం. అయితే సాధారణంగా ట్రాఫిక్ జామ్‌ అయితే ఏమీ చేస్తారు.. ఏముంది.. కొద్దిసేపు వెయిట్‌ చేస్తాం లేదా.. పాటలు వింటూ ఉంటాం.. ఇంకా ఓపిక లేకపోతే ట్రాఫిక్‌ జామ్‌పై ప్రభుత్వాలను తిట్టుకుంటాం. కానీ కొందరు క్రియేటివిటీ ఉన్నవారు చాలా తెలివిగా ఆలోచించి ట్రాఫిక్‌ జామ్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకుంటారు.. ఎలా అంటారా.. ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరూ సిటీలో ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్న బస్‌ డ్రైవర్‌ ఇలా చేశాడు.. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న బెంగళూరు మహానగరంలో ఈ మధ్య కాలంలో ట్రాఫిక్‌ కూడా పెరిగిపోతోంది. ఎంత పెరిగి పోయిందంటే.. ఒక బస్‌ డ్రైవర్‌ ట్రాఫిక్‌ జామ్ సమయంలోనే లంచ్‌ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అంత సేపు పట్టింది ట్రాఫిక్‌ జామ్‌ క్లియర్‌ కావడానికి.

Read Also: Viral Video: క్రేజీ స్టెప్స్‌తో దుమ్మురేపిన బామ్మ

బస్‌ డ్రైవర్‌ తాను తెచ్చుకున్న లంచ్‌ బాక్స్‌ను స్పూన్‌తో పూర్తి చేశాడు. తరువాత ప్రశాంతంగా నీరు తాగి తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. అంత సమయం పట్టింది పట్టింది ట్రాఫిక్‌ జామ్‌ క్లియర్‌ కావడానికి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్‌లో నిలిచిన బస్సులో డ్రైవింగ్ సీటులో కూర్చొని బస్‌ డ్రైవర్ లంచ్ చేయడం కనిపిస్తుంది. దీనికి పీక్ ట్రాఫిక్ మూవ్‌మెంట్ ఇన్ బెంగళూరు అనే క్యాప్షన్‌ను యూజర్ జత చేశాడు. ట్రాఫిక్ వల్ల బస్సు డ్రైవర్ ప్రశాంతంగా భోజనం చేసే టైం కూడా దొరకడం లేదని మరో నెట్‌జన్ డ్రైవర్ స్థితిపట్ల సానుభూతి వ్యక్తం చేశాడు.