BCCI Prize Money: ఉత్కంఠగా సాగిన 2025-26 విజయ్ హజారే ట్రోఫీని విదర్భ జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నిజానికి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకోవడం విదర్భ జట్టుకు ఇదే మొదటిసారి. ఇదే టైంలో విదర్భ జట్టు ప్రస్తుత రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ ఛాంపియన్ కూడా. విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ సౌరాష్ట్రను ఓడించి టైటిల్ ముద్దాడింది. విజేత జట్టుకు బీసీసీఐ ఇచ్చిన నజరానా ఎంతో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Dasoju Sravan : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు.!
రెండేళ్ల క్రితం ప్రైజ్ మనీని పెంచిన బీసీసీఐ..
నిజానికి అన్ని దేశీయ టోర్నమెంట్లకు BCCI ప్రైజ్ మనీని పెంచిన సమయంలో విదర్భ జట్టు విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. BCCI రెండు సంవత్సరాల క్రితం ఏప్రిల్ 2023లో అన్ని దేశీయ టోర్నమెంట్లకు ప్రైజ్ మనీని పెంచింది. ఆ టైంలో అప్పటి BCCI కార్యదర్శి జై షా.. దేశీయ టోర్నమెంట్ ప్రైజ్ మనీని పెద్ద మొత్తంలో పెంచారు. తాజా కొత్త సవరణ తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ప్రైజ్ మనీ మూడు రెట్లు పెరిగింది.
ఇప్పుడు ఛాంపియన్ రివార్డు మూడు రెట్లు..
విజయ్ హజారే ట్రోఫీలో విజేత జట్టు గతంలో రూ.30 లక్షల ప్రైజ్ మనీని అందించే వారు. ఏప్రిల్ 2023 సవరణ తర్వాత, BCCI ఆ ప్రైజ్ మనీని రూ.1 కోటికి పెంచింది. గతంలో రూ.15 లక్షలు అందుకున్న రన్నరప్ జట్టుకు ఏప్రిల్ 2023 నుంచి రూ.50 లక్షలకు పెంచారు. ఇదే టైంలో 2025-26 విజయ్ హజారే ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టుకు కూడా రూ.1 కోటి ప్రైజ్ మనీ అందుకుంది. ఫైనల్‌లో వారితో ఓడిపోయిన సౌరాష్ట్రకు రూ.50 లక్షల రన్నరప్ ప్రైజ్ మనీ లభించింది.
READ ALSO: Karnataka DGP Viral Video: ఆఫీస్‌లో రాసలీలు.. డీజీపీ గారు ఏంటీ పని!
