వైద్య ఆరోగ్య రంగంలో కూటమి ప్రభుత్వం పెయిల్ అయ్యిందని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ‘ఆరోగ్యశ్రీ’ అనారోగ్యశ్రీగా మారిపోయిందని విమర్శించారు. 3 వేల కోట్లు బకాయిలు రాక నెట్ వర్క్ ఆస్పత్రులు బోర్డులు తిపేస్తున్నాయన్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులు బకాయిలు విడుదల చేయాలని అనేక సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. బకాయిలు నిలిచిపోవడంతో సేవలు నిలిపివేశారని, దేశంలో ఎక్కడ ఆరోగ్య సేవలు నిలిచిపోలేదని విడదల రజిని ఫైర్ అయ్యారు.
‘1059 నుండి 3257 వ్యాధుల వరకు ఆరోగ్యశ్రీ సేవలను గత ప్రభుత్వం పెంచింది. ఆరోగ్య ఆసరా కూడా నేడు లేకుండా చేసింది. 900 నెట్ వర్క్ ఆసుపత్రులను 2300కి పెంచింది గత ప్రభుత్వం. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు నాటి ప్రభుత్వం తీసుకుంది. ప్యామీలి డాక్టర్ పథకాన్ని తీసుకుని వచ్చాం. నెట్ వర్క్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. పీహెచ్సీ డాక్టర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. వైద్య ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదు. ఎమర్జెన్సీ వస్తే ప్రజలు వాళ్ల బాధలు వాళ్లు పడాల్సిందే. విద్య, వైద్యంలో ప్రజలు అస్తులు అమ్ముకోవాలి. ఇన్సూరెన్స్ మోడల్ అంటారు.. అది కూడా రెండున్నర లక్షలే. వాళ్ల స్టాండ్ ఏంటో వాళ్లకే క్లారిటీ లేదు’ అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు.
Also Read: CM Chandrababu: ఎద్దులతో కరెంట్ ఉత్పత్తి చేయడం తొలిసారి చూస్తున్నా!
‘ఇతర రాష్ట్రాల్లో ఇన్సురెన్స్ మోడల్, హెబ్రీడ్ మోడల్ విఫలం అయ్యింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకుని వచ్చిన ఆరోగ్యశ్రీని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుంటే.. ఆరోగ్యశ్రీని చంపాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది. డయేరియా వంటి అంశాలు వచ్చిన ఎందుకు వచ్చిందో తెలుసుకునే పరిస్ధితి లేదు. గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన మెడికల్ కాలేజ్లు అమ్మడంతో కూటమి ప్రభుత్వం బిజీగా ఉంది. నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము పీపీపీకి వెళ్లలేదు. పీపీపీ నుండి ప్రభుత్వం వెనక్కి వెళ్లే వరకు వైసీపీ పోరాటం చేస్తుంది. ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఆరోగ్య భద్రత, ఆర్దిక భద్రత అందిస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది.. ఆ పని కూటమి ప్రభుత్వం చేయడం లేదు’ అని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
