గత సంవత్సరం లోక్ సభ నుంచి బహిష్కరించబడిన తర్వాత మరోసారి కృష్ణానగర్ స్థానం నుంచి టీఎంసీ తిరిగి మహువా మొయిత్రాను ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈ సందర్భంగా మహువా మొయిత్రా మాట్లాడుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కాషాయ పార్టీకి రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. కేంద్రానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్న సెలక్షన్ కమిటీ ద్వారా కమీషనర్లను ఎంపిక చేసినందున ఎన్నికల సంఘం “స్వాతంత్ర్యం కోల్పోయింది” అని మాజీ ఎంపీ మొయిత్రా అన్నారు.
Read Also: Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోల హతం
ఇక, కృష్ణానగర్ లోక్‌సభ సీటును భారీ మెజార్టీతో దక్కించుకుంటాను అని టీఎంసీ నేత మహువా మోయిత్రా ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది తనను లోక్‌సభ నుంచి బహిష్కరణ, ఈడీ నోటీసులు ద్వారా తన ప్రతిష్టను దిగజార్చేందుకు పన్నిన కుట్రకు విజయం సాధించి తగిన సమాధానం చెబుతాను అని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినందన్నారు. ఇక, నా గెలుపుపై ఎలాంటి సందేహం లేదు.. ఎంత పెద్ద మార్జిన్ ఉంటుందనేది జూన్ 4వ తేదీన తెలుస్తుందన్నారు. నాకు ఇక్కడి ప్రజలకు గట్టి సంబంధాలు ఉన్నాయి.. 2019 ఎన్నికల్లో 60 వేల ఓట్ల తేడాతో గెలుపొందాను.. మొత్తం పోలైన ఓట్లలో 45 శాతం ఓట్లను సాధించానని టీఎంసీ మాజీ ఎంపీ మహూవా మొయిత్రా పేర్కొన్నారు.