Hair Plantation Fraud: బట్టతలతో నలుగురిలో తిరగాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.. దీంతో, క్యాప్‌లు, విగ్గులు పెట్టి కవర్ చేసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.. అయితే, మీ బట్టతలపై జుట్టు మొలిపిస్తాం అంటూ.. వారిని వీక్‌సెన్‌సు క్యాష్ చేసుకునేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.. హెయిర్‌ప్లాంటేషన్‌తో కొంతమంది తిరిగి జుట్టు పొందిన.. వాటితోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేవాళ్లు లేకపోలేదు.. మరోవైపు.. బట్ట తలపై వెంటుకలు పొలిపిస్తామంటూ.. ఉన్న కాస్త జుట్టును కూడా గుండు గీయించి.. ఆ తర్వాత ఏదో ఆయిల్ రుద్దులని చెప్పి ఉన్న బొచ్చు లేకుండా చేసినవారు కూడా ఉన్నారు.. ఇప్పుడు ఇలాంటి సమస్యతోనే పోలీస్ స్టేషన్‌కు మెట్లు ఎక్కాడు కాకినాడకు చెందిన ఓ వ్యక్తి..
Read Also: Trump’s South Asia Strategy: ట్రంప్ ప్లాన్ ఏంటి..? పాకిస్థాన్‌ను పావుగా మార్చుకున్నారా..?
బట్టతల మీద జుట్టు తెప్పిస్తామని డబ్బులు తీసుకుని వీఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ మోసం చేశారని కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సురేష్ అనే వ్యక్తి.. తలపై జట్టు లేని చోట హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి హెయిర్ రప్పిస్తామని వచ్చిన ప్రకటనతో మోసపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.. 98 వేల రూపాయల ప్యాకేజీతో జుట్టు తెప్పిస్తామని చెప్పి తనవద్ద 10 వేలతో పాటు కంపెనీ వారు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 80 వేలు ఫైనాన్స్ చేయించి కంపెనీకి జమచేశారని చెబుతున్నాడు సురేష్.. 9 నెలల నుంచి వెళ్ళిన ప్రతి సారి టెస్టులకు 3 వేల నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అయ్యేదని ఫిర్యాదు చేశాడు. ఈ నెల 5వ తేదీన ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి గుండు గీయించారని.. ఆ తర్వాత షుగర్, బీపీ కంట్రోల్ లో లేదని ట్రీట్మెంట్ చేయలేమని చెబుతున్నారని వాపోయాడు.. తాను బయటికి రాలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, వీఆర్ఎస్ హెయిర్ ప్లాంటేషన్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సురేష్..
