Site icon NTV Telugu

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్‌ డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్ఖడ్‌కు క్రిటికల్ కేర్ యూనిట్‌ (సీసీయు)లో అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా.. ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా ఆసుపత్రికి వచ్చి ఆయన హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో ఉప రాష్ట్రపతి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version