సీఎం హౌస్‌లో రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో నిందితుడు విభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ సీఎం హౌస్ నుండి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇప్పుడు విభవ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు. మరికొద్ది సేపట్లో అతన్ని అరెస్టు చేస్తారని భావిస్తున్నారు. విభవ్ ఢిల్లీ వెలుపల లేడని, ముఖ్యమంత్రి నివాసంలోనే ఉన్నాడని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వాళ్లు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
READ MORE: Hardik Pandya: క్వాలిటీ క్రికెట్ ఆడలేదు.. మూల్యం చెల్లించుకున్నాం!
వాస్తవానికి మే 13న స్వాతి మలివాల్‌పై దాడి ఘటన వెలుగులోకి రావడంతో అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన విభవ్ కుమార్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీని తర్వాత అతను ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి శుక్రవారం కోర్టు ముందు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఇందులో విభవ్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసిన తర్వాత.. ఢిల్లీ పోలీసులు విభవ్‌ను అరెస్టు చేసేందుకు అతడి కోసం వెతికారు. దాదాపు 10 బృందాలు కేసును దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగాయి. అందులో 4 బృందాలు కేవలం నిందుతుడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించాయి.
శుక్రవారం సీఎం ఇంటికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనను రీహార్సల్ చేశారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. అందులో ఓ విడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో భద్రతా సిబ్బంది స్వాతి మలివాల్ ను చేతితో పట్టుకుని బయటకు తీసుకొస్తున్నట్లు కనిపించింది. విభవ్ కుమార్ ఢిల్లీ వదిలి వెళ్లలేదని.. సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే తలదాచుకున్నాడని ఢిల్లీ పోలీసులకు శనివారం సమాచారం అందడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.