Actress Passes Away : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Passes Away : సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న గాక మొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని మరచిపోక ముందే ఇండస్ట్రీ మరో సీనియన్ నటిని కోల్పోయింది. ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్(69) నిన్న రాత్రి కన్ను మూశారు. ఆమె గత మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. ఏడాది క్రితం నుంచి ఆమె కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని లూథియానాలో నిన్నరాత్రి తుదిశ్వాస విడిచారు.
Read Also: Twitter : ఎలాన్ మస్క్‌కు ఉద్యోగుల షాక్.. ట్విట్టర్‌కు వందలాది మంది గుడ్ బై
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఆమె నరాల సంబంధిత సమస్యతో బాధపడుతూ సుమారు 12 ఏళ్ల క్రితం ముంబై నుంచి లూథియానాకు వెళ్లింది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా లూథియానాలోని గురుసర్ సుధార్ ప్రాంతంలో తన బంధువు హర్జీందర్ సింగ్ ఖంగురాతో కలిసి నివసిస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది కాలంగా తీవ్ర కోమాలో ఉన్నారు. ఆమె 1976లో పంజాబీ చిత్రం ‘దాజ్’తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. పుట్ జట్టన్ దే, మమ్లా గర్బార్ హై, కి బాను దునియా దా, పటోలా, సైదా జోగన్తో సహా 10 హిందీ, 70 పంజాబీ సినిమాల్లో నటించారు. తన భర్త హర్మీందర్ సింగ్ డియోల్ ను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన తర్వాత ఆమె తన చిత్ర పరిశ్రమను విడిచిపెట్టారు. పంజాబీ చిత్ర పరిశ్రమకు కౌర్ అందించిన సహకారం మరువలేనిదని నటుడు, దర్శకుడు తర్లోచన్ సింగ్ అన్నారు.
Read Also:House Fire: చంద్రగ్రహణం తెచ్చిన తంట.. అప్పటినుంచి ఆ ఇంట్లో రోజు మంటలే..
లూథియానాలోని ఐటియానా గ్రామానికి చెందిన కౌర్ 1953లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి యాక్టింగ్ కోర్సు చేశారు. ఆమె హాకీ, కబడ్డీ క్రీడాకారిణి కూడా.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!