NTV Telugu Site icon

Vespa: ‘వెస్పా’ కొత్త మోడల్… ధర వింటే దిమ్మ తిరగాల్సిందే

Justin

Justin

JUSTIN BIEBER X VESPA: వెస్పా.. స్కూటీలలో దీనికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. దీనికి ఉండే లుక్ ఇది ఇచ్చే కంఫర్ట్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. అందుకే అమ్మాయిలు ఇదంటే పడి చచ్చిపోతుంటారు. అబ్బాయిలకు బులెట్ బండి అంటే ఎలా పిచ్చి ఉంటుందో అమ్మాయిలకు కూడా వెస్పా అంటే కూడా అలానే ఉంటుంది. దీని స్మూత్ డ్రైవింగ్ అందరికి భలే నచ్చుతుంది.  ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఇది ఇటలీకి చెందిన అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ. అయితే ఈ కంపెనీ తాజాగా కొత్త మోడల్ ను ఇండియన్ మార్కెట్ లోకి తెచ్చింది. ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది పియాజియో సంస్థ . దీని ధర తెలిస్తే సామాన్యులు మాత్రమే కచ్ఛితంగా అవక్కవుతారు. ఆ ధరతో ఓ చిన్నసైజ్ కారు కూడా కొనుక్కోవచ్చు. ఇంతకీ ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ ధర ఎంతా అనుకుంటున్నారా? దాని ధర ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ. 6.45 లక్షలు అంట.

Also Read:Flags: నిజమైన దేశభక్తి అంటే ఇది… శభాష్ రా బుడ్డోడా

అయితే దీనికి ఇంత ధర ఉండటానికి కారణంగా దీనికి ఉండే స్పెషల్ ఫీచర్స్ అంట. దీనిని కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఆలోచనలకు అనుగుణంగా  డిజైన్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. బీబర్ అంటే తెలియని వారుండరు, అతని పాటలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే దీని కోసం బీబర్ తో పియాజియో సంస్థ అగ్రిమెంట్ చేసుకుందని సమాచారం. ఇది పరిమిత ఎడిషన్ అని లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే ఈ స్కూటీలను విక్రయిస్తామని సంస్థ తెలిపింది. అందుకే వీటికి ఇంత ధరను నిర్ణయించింది.

ఇక స్కూటీ ఫీచర్స్ విషయానికి వస్తే వెస్పా కొత్త మోడల్ స్కూటీ 150 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. 8 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ట్యాంక్ కూడా ఉంది. ఇక మిగిలినవన్నీ కడా వెస్పా గత మోడల్ లో ఉన్న ఫీచర్స్ మాదిరే ఉన్నాయి. స్కూటీ కొంటే దానితో పాటు ఒక బ్యాగ్, హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్ లు అందిస్తున్నారు. ఇక ఈ స్కూటీని ఆన్ లైన్ లో ప్రీ బుకింగ్ చేసుకోవాలి. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి కావాలనుకున్న వారు త్వరగా బుక్ చేసుకుంటే దీనిని పొందే అవకాశం ఉంటుంది.