Site icon NTV Telugu

దేశ రాజధానిలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం గుబులు రేపుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 352గా నమోదైంది. అలాగే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. అయితే దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత సూచీ మరింత దిగజారే అవకాశముందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా (CBCB) హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు మృతి

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురువారం రాత్రికి తీవ్ర కేటగిరిలోకి వచ్చే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఎయిర్ క్వాలిటీ ఫోర్‌కాస్ట్ ఏజెన్సీ సఫర్ వెల్లడించింది. ఇప్పటికే ఢిల్లీలోని ఐటీఏలో 354, అయానగర్‌లో 315, లోధిరోడ్‌లో 303,మేజర్ ధ్యాన్‌చంద్ నేషన్ స్టేడియం వద్ద 336, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు వద్ద 306, చాందినీ చౌక్‌ వద్ద 341, ద్వారకా సెక్టార్-8లో 340, ఓఖ్లాలో 359, అరబిందో మార్గ్‌లో 329గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది.

Exit mobile version