NTV Telugu Site icon

Vinesh Phogat: సస్పెన్స్ కంటిన్యూ.. తీర్పు మరోసారి వాయిదా

Vinesh Phogat

Vinesh Phogat

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు మరోసారి వాయిది పడింది. ఆగష్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తెలిపింది. వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇస్తారా లేదా అనేది స్పోర్ట్స్ కోర్టు నిర్ణయించనుంది. కాగా.. దీనిపై ఇప్పటికే విచారణ పూర్తయింది. ముందుగా ఆగస్టు 10న నిర్ణయం వెలువడుతుందని అనుకున్నప్పటికీ.. ఆగస్టు 13కి వాయిదా వేశారు. కాగా.. ఈరోజు తీర్పు వస్తుందని భారతదేశ ప్రజలు ఉత్కంఠతో చూస్తుండగా.. ఈ సస్పెన్స్ అలానే కంటిన్యూ అవుతుంది. ఆగస్టు 16న తీర్పు వెలువడనుంది.

Read Also: Kamikaze Drones: ప్రాణాంతక ‘‘ఆత్మాహుతి డ్రోన్‌ల’’ ఆవిష్కరణ.. స్వదేశీ టెక్నాలజీతో తయారీ..

కాగా.. రెజ్లింగ్ ఫైనల్ కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో IOC ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. ఈ క్రమంలో.. తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. ఇదిలా ఉంటే.. వినేష్‌కు క్రీడా రంగంలోని పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. వీరిలో జపాన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ రెజ్లర్ హిగుచి రే, అమెరికా రెజ్లర్ జోర్డాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంటి కొందరు దిగ్గజాలు ఆమెకు సపోర్ట్ చేశారు. మరి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read Also: New SIM card rules: సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్.. అలా చేశారో మీ సిమ్ కార్డు బ్లాక్..!

Show comments