Devi Sri Prasad: బలగం లాంటి హిట్ అందుకున్న తర్వాత వేణు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరగడమే తప్ప, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, హీరో ఎవరు అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. నిజానికి, ఈ స్క్రిప్ట్‌ను ముందుగా నాని, తేజ వంటి హీరోలకు వినిపించారు. స్క్రిప్ట్ బాగానే ఉంది కానీ, తాము చేయలేము అని ఆయా హీరోలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నితిన్, శర్వానంద్ సహా ఈ మధ్యకాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి దగ్గరికి కూడా ఈ కథ వెళ్ళింది. అందరూ కథ బాగానే ఉంది అంటున్నారు కానీ, ఆ కథతో సినిమా చేసేందుకు ఎవరు సాహసించడం లేదు.
READ ALSO: X Mark On Train Coach: రైలు వెనుక “X” గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా!
అయితే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ఈ సినిమా చేయడానికి దేవి శ్రీ ప్రసాద్‌ను అప్రోచ్ అయ్యారట. దేవి శ్రీ ప్రసాద్ కూడా అందుకు ఒప్పుకున్నారట. అయితే, ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేసిన కథను దేవి శ్రీ ప్రసాద్ ఎందుకు ఒప్పుకున్నాడు అనే విషయం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి, కొన్ని సినిమాలు స్టార్స్ చేస్తేనే నడుస్తాయి. కొన్ని కొత్తగా వస్తున్న వారు లేదా పెద్దగా స్టార్ ఇమేజ్ నటన విషయంలో లేని వారు చేస్తే నడుస్తాయి. బహుశా అందుకే ఈ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌ను అప్రోచ్ అయ్యారేమో అని చర్చ జరుగుతుంది.
నిజానికి, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒకపక్క వేణుతో పాటు మరోపక్క దిల్ రాజు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా చేస్తే కచ్చితంగా వర్కౌట్ అవుతుందని వారిద్దరూ నమ్ముతున్నారు. మరి దేవి శ్రీ ప్రసాద్ ఒప్పుకున్న దానికైనా ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.
