Site icon NTV Telugu

Venu Swami: ప్రభాస్ జాతకంలో పాము.. పెళ్లయిన వెంటనే?

Adipurush, Prabhas, Venu Swamy,salar,

Adipurush, Prabhas, Venu Swamy,salar,

Venu Swami: ప్రముఖ జోతిష్కులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన చాలా పాపులర్ అయ్యాడు. ఇక ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్ల జాతకం చెప్పగా.. వారి జాతకాలు చాలా వరకు నిజం అయ్యాయి. అయితే వేణుస్వామి తాజాగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఏ సినిమా విడుదల అయినా ఆయన దానికి ముందు కామెంట్స్ చేయడం సాధారణం. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ ముందు కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ప్రభాస్‌తో సినిమాలు తీయాలి అనుకున్న వారు కచ్చితంగా జాతకం చూపించుకోవాల్సిందే అంటూ బాంబు పేల్చారు. లేకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి రాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. అప్పట్లో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Read Also:CM KCR: నేడు సూర్యాపేటకు సీఎం.. పార్టీ తోరణాలతో గులాబీమయంగా జిల్లా కేంద్రం..

తర్వాత విడుదలైన ఆది పురుష్ సినిమా కూడా నెగటివ్ టాక్ తెచ్చుకోవడం తో మరోసారి సోషల్ మీడియాలో తన వివాదాస్పద కామెంట్లతో రెచ్చిపోయాడు. ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఎంతోమంది జాతకాలు చూశాను కానీ తనలాంటి జాతకం చూడాలేదు. ఆయన జాతకంలో పాముంది. కానీ ప్రభాస్ జాతకాలను నమ్మడు. అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ కాదు. ప్రభాస్ ది మాత్రమే కాదు దర్శకధీరుడిగా పేరొందిన రాజమౌళి జాతకం కూడా అలాగే ఉంది. ప్రభాస్‌తో సినిమా తీసే ముందు నిర్మాతలు ఒకసారి తమ జాతకం కూడా చూపెట్టుకుంటే మంచిది. లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ప్రభాస్ జాతకంలో ఉన్న దోషం కారణంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ ఎక్కువ కాలం నిలబడవు. తర్వాత ప్రభాస్ పెళ్లి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి ఆలస్యం అవుతుంది. ఒకవేళ చేసుకున్నా అనేక సమస్యలు ఎదురవుతాయంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Also:Boat Ride on Crocodiles: ఈడు మగాడ్రా బుజ్జి.. వందలాది మొసళ్లనే ఉ** పోయించాడుగా! వీడియో వైరల్

Exit mobile version