Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venu Swamy React on Naga Chaitanya and Sobhita Dhulipala’s Comments: ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, మరోవైపు పూజలు చేస్తూ.. ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయిపోయాడు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ గెలుస్తాడని చెప్పి.. బొక్కబోర్లా పడ్డాడు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్న వేణుస్వామి.. ఇకపై తాను సెలబ్రిటీల జాతకం అస్సలు చెప్పనని ప్రకటించాడు. అయితే తాజాగా నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల జంటపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకం కలవలేదని.. పెళ్లి చేసుకున్న అనంతరం ఒక అమ్మాయి కారణంగా 2027లో విడిపోతారని వేణుస్వామి చెప్పాడు. చై-శోభిత కలిసి ఉండాలని, తన జోతిష్యం తప్పుకావలని కోరుకుంటున్నట్లు కూడా పేర్కొన్నాడు. దాంతో వేణుస్వామిపై మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. శుభమా అని ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇలాంటి అశుభ మాటలు ఏంటి?, అసలు మిమ్మల్ని ఎవడు జాతకం చెప్పమన్నాడు? అంటూ నెటిజెన్స్ మండిపడ్డారు.
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
Also Read: Mufasa Movie: ‘ముఫాసా’ కోసం ఇద్దరు తనయులతో కలిసి రంగంలోకి షారుఖ్ ఖాన్!
ట్రోల్స్‌ని తట్టుకోలేని వేణుస్వామి ఓ వీడియో రిలీజ్ చేసి.. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల జాతకంను ఎందుకు చెప్పాడో వివరణ ఇచ్చాడు. ‘మూడు రోజుల క్రితం నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల జాతకం చెప్పాను. దానిపై ట్రోల్స్, డిబేట్స్ జరుగుతున్నాయి. గతంలో సమంత- నాగచైతన్య జాతకాన్ని చెప్పాను కాబట్టి.. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చెప్పా. నేను ఇచ్చిన మాటపైనే ఉంటాను. సెలబ్రిటీల జాతకం చెప్పడం మానేశానని చెప్పాను, అదే మాటపై ఉంటున్నా. రాజకీయ విశ్లేషణ కూడా చెయ్యను. ఇప్పుడే మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడారు. ఆయనకు క్లారిటీ ఇచ్చాను. ఇకపై ఎవరి జాతకం చెప్పను అని చెప్పా. నాతో నేరుగా మాట్లాడతా అన్నారు’ అని వేణుస్వామి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!