NTV Telugu Site icon

Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి

Astrologer Venu Swamy

Astrologer Venu Swamy

Venu Swamy React on Naga Chaitanya and Sobhita Dhulipala’s Comments: ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు సెల‌బ్రిటీల‌ జాతకాలు చెబుతూ, మరోవైపు పూజలు చేస్తూ.. ఆయన కూడా ఓ సెల‌బ్రిటీ అయిపోయాడు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో వైఎస్ జ‌గ‌న్ గెలుస్తాడ‌ని చెప్పి.. బొక్కబోర్లా పడ్డాడు. దీనిపై విప‌రీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్న వేణుస్వామి.. ఇక‌పై తాను సెల‌బ్రిటీల‌ జాత‌కం అస్సలు చెప్ప‌న‌ని ప్ర‌క‌టించాడు. అయితే తాజాగా నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల జంట‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు.

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జాత‌కం క‌ల‌వ‌లేద‌ని.. పెళ్లి చేసుకున్న అనంత‌రం ఒక అమ్మాయి కారణంగా 2027లో విడిపోతార‌ని వేణుస్వామి చెప్పాడు. చై-శోభిత క‌లిసి ఉండాలని, తన జోతిష్యం త‌ప్పుకావ‌ల‌ని కోరుకుంటున్నట్లు కూడా పేర్కొన్నాడు. దాంతో వేణుస్వామిపై మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. శుభమా అని ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇలాంటి అశుభ మాటలు ఏంటి?, అసలు మిమ్మల్ని ఎవడు జాతకం చెప్పమన్నాడు? అంటూ నెటిజెన్స్ మండిపడ్డారు.

Also Read: Mufasa Movie: ‘ముఫాసా’ కోసం ఇద్దరు తనయులతో కలిసి రంగంలోకి షారుఖ్ ఖాన్!

ట్రోల్స్‌ని త‌ట్టుకోలేని వేణుస్వామి ఓ వీడియో రిలీజ్ చేసి.. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల జాతకంను ఎందుకు చెప్పాడో వివరణ ఇచ్చాడు. ‘మూడు రోజుల క్రితం నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల జాతకం చెప్పాను. దానిపై ట్రోల్స్, డిబేట్స్ జరుగుతున్నాయి. గతంలో సమంత- నాగచైతన్య జాతకాన్ని చెప్పాను కాబట్టి.. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చెప్పా. నేను ఇచ్చిన మాటపైనే ఉంటాను. సెల‌బ్రిటీల‌ జాత‌కం చెప్పడం మానేశానని చెప్పాను, అదే మాటపై ఉంటున్నా. రాజకీయ విశ్లేషణ కూడా చెయ్యను. ఇప్పుడే మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడారు. ఆయనకు క్లారిటీ ఇచ్చాను. ఇకపై ఎవరి జాతకం చెప్పను అని చెప్పా. నాతో నేరుగా మాట్లాడతా అన్నారు’ అని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

Show comments