Site icon NTV Telugu

Venu Swami : విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..

Whatsapp Image 2023 12 28 At 2.39.19 Pm

Whatsapp Image 2023 12 28 At 2.39.19 Pm

సెలబ్రిటి జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అవసరం లేదు.సెలబ్రిటీల జాతకాలపై మరియు వారి వ్యక్తిగత జీవితాల పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. వేణు స్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇక కెరీర్ ఉండదని గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే సలార్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేశారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తే మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి అని కేవలం ఒక్క సినిమా మాత్రమే హిట్ అని వేణు స్వామి తనని తాను సమర్థించుకున్నారు.

తాజాగా వేణు స్వామి రష్మిక మందన, విజయ్ దేవరకొండ లవ్ ఎఫైర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ విజయ్, రష్మిక రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా.. వేణు స్వామి అది అందరికి తెలిసిందే కదా అని అన్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అని ఆయన అన్నారు. కానీ విడిపోతారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.డైరెక్ట్ గా నేను ఈ విషయాన్ని రష్మికకే చెప్పాను. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకు అని చెప్పాను . ఆ విషయంలో నాకు రష్మికకి గొడవలు కూడా జరిగాయి. విభేదాలు వచ్చాయి. అప్పటికి వరకు నా క్లయింట్ గా ఉన్న రష్మిక ఆ గొడవతో దూరంగా ఉండిపోయింది. అయినా నాకేం ఇబ్బంది లేదు అని వేణు స్వామి తెలిపారు.అయితే రష్మిక గతంలో వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పిక్స్ కూడా బయటకి వచ్చాయి.

Exit mobile version