Site icon NTV Telugu

Vishwanath and Sons : వెంకీ అట్లూరి.. మళ్ళి అదే ఓల్డ్ స్కూల్ ప్యాట్రన్ కు వెళ్తున్నాడా?

Venky Atluri

Venky Atluri

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తన కెరీర్ ప్రారంభంలో రూపొందించిన తొలి మూడు చిత్రాల్లో ఒకే తరహా నేరేటివ్ ప్యాటర్న్‌ను ఫాలో అయ్యవాడు. మొదటి భాగం ఇండియాలో ఒక లవ్ ట్రాక్ నడిపి సెకండాఫ్ లో విదేశాల్లో కథని నడిపించేవాడు. అలా తొలిప్రేమతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన మజ్ను, రంగ్ దే కూడా ఇదే ప్యాట్రన్ ఫాలో అవడంతో ఆ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.  దాంతో వెంకీ ఫార్మాట్‌పై తీవ్ర ట్రోలింగ్ కూడా ఎదురైంది. వరుసగా రెండు ఫ్లాప్‌లు రావడంతో ఆ పద్ధతిపై విమర్శలు మరింత పెరిగాయి.

Also Read : PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్

అయితే తర్వాత ఆయన తన కథన విధానంలో మార్పులు చేశారు. తమిళ హీరో ధనుష్ తో స్ట్రయిట్ సినిమాగా సార్ సినిమాతో ఇంట్రడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన సార్ తో కొత్త ప్యాట్రన్ ను ఫాలో అయిన వెంకీ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ తో మరోక హిట్ కూడా అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో ఒక  కొత్త తరహా టేకింగ్‌ను చూపిస్తూ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ, సమాజానికి సంబంధించిన అంశాలను చర్చిస్తూ రూపొందించిన ఈ సినిమాలు వెంకీకి మంచి విజయాలను అందించాయి. దీంతో దర్శకుడిగా ఆయనపై నమ్మకం మరింత బలపడింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా Vishwanath and Sonsపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలైన ఫస్ట్ లుక్‌ను పరిశీలిస్తే, వెంకీ అట్లూరి మళ్లీ తన పాత శైలిలోని కొన్ని అంశాలను రివిజిట్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పాత నోస్టాల్జియాకు కొత్త ట్విస్ట్‌తో అందించే ప్రయత్నమా? లేక మళ్లీ అదే ఓల్డ్ ఫార్మాట్ తో వస్తున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి వెంకీ అట్లూరి ఎలాంటి మ్యాజిక్ చూపిస్తారో చూడాలి.

Exit mobile version