NTV Telugu Site icon

IPL 2025 Mega Action: జాక్ పాట్ కొట్టిన వెంకటేష్ అయ్యర్‌.. అమ్ముడుపోని టీమిండియా బాట్స్మెన్

Venkatesh Iyer

Venkatesh Iyer

IPL 2025 Mega Action Venkatesh Iyer goes to Kolkata Knight Riders: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను రాను రాను ఆచూతూచి కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ ను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి భారీ ధరకు కైవసం చేసుకుంది. వీరిద్దరిని భారీ ధరలకు కొనుగోలు చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు మరో టీమిండియా బ్యాటెర్ వెంకటేష్ అయ్యర్ కోసం తెగ పోటీ పడ్డాయి. దింతో అతడు జాక్ పాట్ కొట్టినట్లింది. రూ. 23.75 కోట్లకు కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ ను కొనుగోలు చేసింది. దింతో ఈ వేలంలో అత్యంత ధర పలికిన మూడో ఆటగాడయ్యాడు. ఇక మిగితా ఆటగాళ్ల గురించి చూస్తే..

Also Read: Satyadev : రివ్యూ రైటర్స్ మరోసారి మా సినిమా చూడాలి!

* ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. హ్యారీ బ్రూక్‌ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.

* ఇకపోతే, టీమిండియా ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ అన్ సోల్డ్‌గా నిలిచాడు. బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు అతడిని ఎవరు కొనుగోలు చేయలేదు.

* గత సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ఐడెన్ మార్క్రమ్‌కు కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దాంతో బేస్ ప్రైస్ రూ.2 కోట్లకే లక్నో సొంతం చేసుకుంది.

* డెవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది.

* రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది.

Also Read: Virat Kohli Century: టెస్టుల్లో 492 రోజుల తర్వాత సెంచరీ చేసి రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ

* ఇక స్టార్ ప్లేయర్స్ లో ఒకడైన డేవిడ్ వార్నర్‌ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు తీసుకురాలేదు. దీంతో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.

* యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్- మెక్‌గర్క్‌ను ఆర్టీఎంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని కోసం పంజాబ్ ఫ్రాంచైజీ పోటీ పడింది.

* హర్షల్ పటేల్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 8 కోట్లకు సొంతం చేసుకుంది.

* రచిన్ రవీంద్రను సీఎస్కే రూ. 4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. ఆర్టీఎం పద్థతిలో సీఎస్కే సొంతం చేసుకుంది.

* స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్‌ను సీఎస్కే రూ. 9.75 కోట్లకు సొంతం చేసుకుంది.