Keerthy Suresh: వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ లో.. హీరోయిన్ కన్ఫర్మ్ !

Anilravipudi, Venkatesh Keerthisuresh

Anilravipudi, Venkatesh Keerthisuresh

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మళ్ళీ జతకడుతున్నారు. ‘F2’, ‘F3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ (Keerthy Suresh) ఎంపికైనట్లు తెలుస్తోంది.

Also Read : Allu Sirish Marriage: ఒకటైన అల్లు శిరీష్ – నయనిక.. వెడ్డింగ్ ఫోటోలు వైరల్!

వెంకటేష్ మార్కు టైమింగ్, అనిల్ రావిపూడి కామెడీకి తోడు ఇప్పుడు కీర్తి సురేష్ లాంటి పెర్ఫార్మర్ తోడవడంతో ఈ ప్రాజెక్ట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కీర్తి ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. ఇక ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక పవర్‌ఫుల్ అండ్ ఫన్నీ రోల్ చేస్తుండటం మరో విశేషం. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ జోడీగా నటించే హీరోయిన్ కోసం సెర్చ్ జరుగుతోంది. కాగా షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన సంక్రాంతి (2027) సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, వచ్చే ఏడాది పండుగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.