Site icon NTV Telugu

Venkaiah Naidu: ‘యోగా ఫర్ మోడీ కాదు.. యోగా ఫర్ బాడీ’.. మాజీ ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అనాలోచిత యుద్ధమని.. ట్రంప్ ఏమీ మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశం శాంతి యుతంగా ఉండాలని, ఇరాన్, ఇజ్రాయెల్ లతో భారతదేశం స్నేహంగా ఉందని తెలిపారు. తాజాగా నక్లేస్‌ రోడ్‌లో ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ భారత్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇరాన్ వాళ్ళు థ్యాంక్ యూ ఇండియా అని అంటున్నారని గర్తు చేశారు. ప్రపంచ మంతా శాంతిగా ఉండాలని కోరారు‌. మనం శాంతి కాముకులం.. కానీ మన జోలికి ఎవరైనా వస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి వాటితో మన ప్రతాపం ఏంటో చూపించామని తెలిపారు. ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ భారత్ పేరుతో రన్ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. దేశ యువత, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

READ MORE: Hyderabad: నగరాన్ని కుదిపేస్తున్న కల్తీ ప్రొడక్ట్స్.. రసాయనాలతో చిక్కీలు, నమ్కీన్ తయారీ

“దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ తో ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా దేశ యువత ఫిట్ ఉండాలి. యోగా ఫర్ మోడీ కాదు. యోగా ఫర్ బాడీ. ఆరోగ్య మార్పు మాత్రమే శక్తివంతమైన మార్పు. ఉదయం లేవగానే రోజు ఆసనాలు, శరీర వ్యాయామం చేయాలి.
ఎవరికి ఇష్టం ఉన్నా దాంట్లో ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉండాలి. సాహిత్యామైన, రన్నింగ్ అయినా, యోగా అయిన ప్రతి చేయాలి. అమెరికాలో సైతం భరత నాట్యం , కూచుపూడీ నేర్పిస్తున్నారు. మన దేశ కల్చర్ ఇతర దేశాల్లో పాటిస్తున్నారు. పోషకాలు ఉండే బియ్యాన్ని తినండి. రాగులు, సజ్జలు జొన్నలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రగ్స్ మారిన పడొద్దు. యువత డ్రగ్, గంజాయి బారిన పడి అనారోగ్యంతో పాటు వ్యసనంగా మారి పనికి రాకుండా పోతున్నారు. సృజనాత్మకత పెంపొందించుకోవాలి. మొబైల్ వాడండి కానీ వ్యసనంగా వాడొద్దు. పురుషులతో సమానంగా మహిళలను భావించండి. కుటుంబ సభ్యులతో సమయం కేటాయించి గడపండి. ఇంట్లో వృద్ధులతో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోవాలి. భారత్ దేశ కుటుంబ వ్యవస్థ గొప్పది. పెద్దల మాట సద్ది మూట. పాఠాలు చెప్పిన గురువులను మర్చిపోవద్దు. తల్లిదండ్రులను, మాతృభాష, మాతృభూమి, దేశాన్ని గౌరవించండి. ఇంగ్లీష్ భాష కళ్ళద్ధలాంటిది. అమ్మ భాషలో మాట్లాడండి. బ్రో ఏంటీ బ్రోకర్ హా ? అని అడిగా. మంచి భోజనం చేయండి. పీజా, బర్గర్లు తినొద్దు.” అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.

READ MORE: RCB Fastest Chase IPL: కోహ్లీ క్లాస్.. పడిక్కల్ మాస్.. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ బిగ్గెస్ట్ రికార్డ్..

Exit mobile version