NTV Telugu Site icon

Venkaiah Naidu : మరోసారి వెంకయ్యనాయుడు సింప్లిసిటీ.. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో..

Venkaiah Naidu

Venkaiah Naidu

భారత మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్‌ నాయకులు వెంకయ్య నాయుడు రెండు రోజులు ఏపీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన బాపట్ల, ప్రకాశం జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన తిరిగి చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆయన విమానంలో కాకుండా రైలులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే.. అందుకోసం ఒంగోలు రైల్వే స్టేషన్‌కు నిన్న ఉదయం చేరుకున్నారు. అయితే.. అప్పటికే వెంకయ్యనాయుడు వెళ్లేందుకు రిజర్వేషన్‌ చేసిన రైలు వచ్చే సమయం 6.05 గంటలు. రైలు పదినిమిషాలు ఆలస్యంగా వస్తోందని తెలిసి.. హోటల్‌ నుంచి ఆ సమయానికి తగ్గట్టుగా ఆయన రైల్వే స్టేషన్‌కు బయలు దేరారు. అయినప్పటికీ మరో పదినిమిషాలు ఆలస్యంగా ఒంగోలు రైల్వే స్టేషన్‌కు వెంకయ్య నాయుడు వెళ్లాల్సిన రైలు ఉదయం 6.25 గంటలకు చేరుకుంది. అయితే.. అప్పటికే రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వెంకయ్య నాయుడు ప్లాట్‌ ఫాం 3 వద్ద 10 నిమిషాల పాటు నిరీక్షించారు.
Also Read : Jairam Ramesh: ఇద్దరు కోటీశ్వరులతో పోటీపడ్డారు.. పాల్వయి స్రవంతికి జైరాం రమేశ్ కితాబు

అదే సమయంలో అక్కడే ఉన్న పలువురితో ఫోటోల దిగారు. అక్కడనున్న వారిని అప్యాయంగా పలుకరించారు. అంతకుముందు.. శనివారం కూడా సాధారణ ప్రయాణీకులతో కలిసి రైలులో ప్రయాణం చేశారు వెంకయ్య నాయుడు. బాపట్ల జిల్లా వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి పినాకినీ ఎక్స్‌ప్రెస్‌‌లో సాధారణ పౌరుడిలా ప్రజల మధ్య ప్రయాణం చేశారు వెంకయ్య నాయుడు. చీరాలలో దిగి వేటపాలెం వెళ్లిన వెంకయ్య నాయుడు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఒంగోలు చేరుకున్నారు. అక్కడ డాక్టర్‌ చుంచు చలమయ్య రచించిన ‘నన్ను తీర్చిదిద్దిన ఉలిచి’ పుస్తకాన్ని ఆవిష్కరించి.. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.