Site icon NTV Telugu

Shiva Deekshas: వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన శివదీక్షలు!

Shiva Deekshas Vemulawada

Shiva Deekshas Vemulawada

తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. శివ స్వాముల ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు అధ్వర్వంలో దాదాపు 300 మంది శివ భక్తులు శివుడి మాలధారణ ధరించారు. నుదుటన, విభూతి కుంకుమ ధరించిన శివ స్వాములకు అర్చకులు రుద్రాక్ష శివ మాల ధారణ వేశారు.

ప్రతి ఏడాది శివరాత్రికి 41 రోజుల ముందు శివుడి మాలధారణ చేసి.. మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోధ్బవ సమయంలో మాల విరమణ చేస్తారు. దాదాపు 35 సంవత్సరాల నుంచి ప్రతియేటా శివుడి మాల వేసుకోవడం అనవాయితీగా వస్తుంది. మానవుడు భగవత్ దీక్ష కలిగియుంటే అరిష్టాలు తొలిగి.. సిరి సంపదలు, సుఖ సంతోషాలు కల్గుతాయని భక్తుల విశ్వాసం. దీక్షల్లో అత్యుత్తమైనది శివ దీక్ష. లయకారుడైనా శివుడిని రూపం ధరిస్తే మోక్షం కల్గుతుందని భక్తుల నమ్మకం. అందుకే శుభకరుడైన మహశివుడిని భక్తులు కొలుస్తారు. శ్రీశైలంలో మొదలైన శివదీక్షలు.. వేములవాడ వరకు విస్తరించాయి.

Also Read: Rajasthan Royals Captain: రాజస్థాన్ రాయల్స్‌లో కెప్టెన్సీ హీట్‌.. ఆర్ఆర్ పోస్ట్ వైరల్!

ప్రతి రోజు సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం కఠిన నియామాలతో శివుడిని పూజిస్తూ భక్తులు కఠిక నేలపై నిద్రిస్తారు. వీటిలో శివ దీక్షలు మహామండలం 108 రోజు, మండల దీక్ష 41 రోజులు, అర్థమండల దీక్ష 21 రోజులు ధరిస్తారు. శివమాల ధరించే స్వాములు తప్పని సరిగా శివుడికి అభిషేకం చేసిన తర్వాతనే.. లింగం ధరించిన స్వాములు మాలలు వేస్తారు. చందన వర్ణం వస్ర్తాలను ధరించి.. నుదుట విభూతి, కుంకుమ చందనం, మెడలో రుద్రక్షమాల ధరిస్తారు. దీక్ష సమయంలో కఠిన నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని ఆర్చకులు తెలిపారు.

Exit mobile version