Vemulawada: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న విస్తరణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆలయ విస్తరణలో భాగంగా చెన్నై నుంచి తెప్పించిన భారీ యంత్రంతో ఫైల్ పుట్టింగ్ విధానంలో పనులు ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో అధికారులు వీటిని నిలిపివేశారు. ఆలయ దక్షిణ రహదారితో పాటు పరిసర ప్రాంతాల్లో పిల్లర్ల కోసం రంధ్రాలు వేసిన సిబ్బందికి అనుకున్న ఫలితం రాలేదు. కొన్నిచోట్ల కేవలం 5 నుంచి 8 అడుగులు మాత్రమే రంధ్రాలు వేయగలిగారు. మరికొన్ని చోట్ల 5 అడుగులు దాటినా, పిల్లర్ల ఏర్పాటుకు అవసరమైన సరైన బేస్ దొరకకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.
TPCC Meeting: నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం.. స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం..!
దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఫైల్ పుట్టింగ్‌కు బదులుగా ఓపెన్ పుట్టింగ్‌ల ద్వారా పిల్లర్లు వేయాలని అధికారులకు సూచించారు. ఈ సాంకేతిక వివరాలను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ) వైస్ చైర్మన్ గరీమా అగర్వాల్‌కు సాంకేతిక బృందం వివరించింది. తాజా సమాచారం ప్రకారం, అధికారులు త్వరలోనే ఓపెన్ పుట్టింగ్ విధానంలో పిల్లర్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు, పనుల కోసం తెచ్చిన భారీ యంత్రాన్ని తిరిగి చెన్నైకి పంపాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల కారణంగా ఆలయ విస్తరణ పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!
