Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా మరో ఐదు కోడెలు మృతి చెందగా, గత రెండు రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితం లేకుండానే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ బంద్.. లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
మరణించిన కోడెల శవాలను మూలవాగులో పాతిపెట్టేందుకు తీసుకువస్తున్న ట్రాక్టర్‌ను గ్రామానికి చెందిన గీతా కార్మికులు, రైతులు అడ్డుకున్నారు. “ఎల్లమ్మ గుడి సమీపంలో శవాలను పాతిపెట్టడమే కాదు, దాని వల్ల వచ్చే దుర్వాసన భరించలేక పోతున్నాం” అంటూ వారు వాపోయారు. రైతులు మాట్లాడుతూ, ఈ గోశాల వల్ల తమ వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని, శవాల వల్ల భూమిలోనూ, నీటిలోనూ కలుషితం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గోశాలలో కోడెల మరణాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా సూచనలు చేశారు. అయినప్పటికీ గోశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వేటూరి ప్రాంతంలోని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విహెచ్‌పి (విశ్వ హిందూ పరిషత్) స్పందిస్తూ – “నేటినుంచి గోశాలలో కోడెల పంపిణీ ప్రక్రియ నిరవధికంగా కొనసాగించాలి” అని డిమాండ్ చేసింది. మృత కోడెల విషయంలో పారదర్శకత, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గోశాల నిర్వహణపై అధికారుల తక్షణ జోక్యం అవసరం ఉందని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
Abhirami: కమల్ హాసన్‌తో లిప్ కిస్ పై స్పందించిన నటి అభిరామి..
