NTV Telugu Site icon

ఇండ్లు లేని వారి కోసం త్వరలో కొత్త పథకం : మంత్రి వేముల

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

త్వరలోనే ఇండ్ల స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీ ఆయన డబుల్‌ బెడ్రూం ఇండ్లపై మాట్లాడుతూ… డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కొందరు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ప్రధాని మోడీని రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ సమగ్ర సర్వేలో ఇండ్లు లేని వాళ్ళు దాదాపుగా 26,31,739 ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,91,000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఇందులో ఇప్పటి వరకు 2,27,000 ఇండ్లను మొదలు పెట్టామమని..వాటిలో 1,03,000 ఇండ్లు పూర్తి అయ్యాయని ప్రకటించారు. 70,000 ఇండ్లు 90 శాతం పనులు పూర్తి అయ్యాయని.. 53,000 ఇండ్లు పురోగతిలో ఉన్నాయన్నారు మంత్రి వేముల. ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల నిర్మాణం కోసం 10,442 కోట్లు ఖర్చు చేసామన్నారు మంత్రి వేముల.