Vellampalli Srinivasa Rao: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.. ఆడుదాం ఆంధ్రా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు.. ఆడుదాం – ఆంధ్రా విజయవంతం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. విజయవాడ పరిధిలో 33 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 4500 టీమ్ లు ఎంపికయ్యాయని తెలిపారు. ఇక, డిసెంబర్ 26 నుంచి 45 రోజులు పాటు ఆడుదాం ఆంధ్రా సాగుతుందని పేర్కొన్నారు.
క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ , ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు వెల్లంపల్లి శ్రీనివాస్.. సీఎం వైఎస్ జగన్ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే యువకులకు ఉపయోగపడే ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు.
ఇక, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఆడుదాం-ఆంధ్రా కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. 64 డివిజన్లలోనూ ఆడుదాం-ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతo చేస్తాం.. క్రీడాకారుల టాలెంట్ ను నిరూపించుకునేందుకు ఇదొక వేదికగా తెలిపారు. మరోవైపు.. ఆటల్లో అవకాశం దక్కని ఎందరికో ముఖ్యమంత్రి ఒక అవకాశం కల్పించారు.. జాతీయ స్థాయిలో తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు ఇదొక అవకాశం.. క్రీడాకారులకు కిట్లు కూడా అందజేస్తున్నాం అన్నారు తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి దేవినేని అవినాష్.. యువకుల కోసం ఇంతమంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
