VellamPalli Srinivas vs Bonda Uma: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ నేత బోండా ఉమా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. వెల్లంపల్లిపై విరుచుకుపడ్డా బొండా ఉమా.. తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.. వ్యక్తిగత దూషణలకు దిగారు.. అమ్మవారి చీరలు, వెండి సింహాలు కొట్టేసినందుకు మంత్రి పదవి నుంచి పీకేశారని.. నామీద మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే.. ప్రతీ యాక్షన్ కీ రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. వెల్లంపల్లి మాట్లాడుతున్న తీరుపై ఇవాళ సీపీకి ఫిర్యాదు ఇచ్చా.. రేపు ఎన్నికల కమిషన్‌కి కంప్లైంట్ ఇస్తా అన్నారు. పచ్చకామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనపడుతుందన్నట్టు ఉంది వెల్లంపల్లి తీరన్న ఆయన.. దేనికైనా తెగించే మనిషి వెల్లంపల్లి.. ఆయన మంత్రిగా సంతకం పెట్టిన కళ్యాణ మండపం బోండా ఉమా కబ్జా అంటాడు.. ఆ కళ్యాణ మండపాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడు.. సంతకం పెట్టిన దొంగ, తీసుకున్న దొంగ కలిసి కబ్జా చేసి, నేను కబ్జా చేశానంటారు.. ఎన్నికల ముందు ఏంటీ మాటలు.. ఆర్డర్ నువ్విచ్చిందా? కాదా? చెప్పు.. ఏది నిజం.. నువ్వు చెప్పింది అబద్ధం అని నిరూపించా.. అభివృద్ధికి చిరునామా నేను అంటూ చెప్పుకొచ్చారు బోండా ఉమా.
Read Also: PM Modi: వెయ్యేళ్ల అభివృద్ధికి పునాదులు వేస్తాం..
అయితే, సత్యనారాయణపురం 33 డివిజన్ పర్యటనలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. బోండా ఉమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదు.. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనేశ్వరి పీఠ స్థలాన్ని కబ్జా చేద్దామని చూశావా? లేదా? భువనేశ్వరి పీఠాన్ని కబ్జా చేయడానికి చూసింది బోండా ఉమే.. ఆ సమయంలో సాక్షాత్తు స్వరూపనంద స్వామి ధర్నా చేశారు. ఏపీలో ఉన్న స్వామీజీలంతా బోండా ఉమాను వ్యతిరేకించారు.. నేను ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ పీఠాన్ని వాళ్లకి అప్పచెప్పాం.. ఆధ్యాత్మిక పీఠాలను కబ్జాలు చేసే వ్యక్తి బోండా ఉమా అంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రతి డివిజన్‌లో కబ్జా భాగోతాలు చాలా ఉన్నాయి.. సత్యనారాయణపురంలో బోండా ఉమాకు డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. అరాచకాలు, రౌడీయిజాలు, కబ్జాలు చేసే వాళ్లు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. త్వరలో అన్ని ఆధారాలతో బోండా ఉమా అరాచకాలు బయటకు తీస్తాం.. హైదరాబాద్ సంస్కృతిని బోండా ఉమా.. విజయవాడ నగరంలో తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు వెల్లంపల్లి శ్రీనివాస్.