Site icon NTV Telugu

Velichala Rajender Rao : బండి సంజయ్.. పిచ్చి ప్రేలాపనలు, కట్టుకథలు మానేయండి

Velichala Rajender Rao

Velichala Rajender Rao

బండి సంజయ్ పై కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ వెలిచాల రాజేందర్ మాట్లాడుతూ.. బండి సంజయ్.. పిచ్చి ప్రేలాపనలు, కట్టుకథలు మానేయండని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు ఎవరో కూడా నాకు తెలియదని, నేనెప్పుడూ ఆయన్ని కలవలేదు… అలాంటప్పుడు ఆయనెలా నాకు టికెట్ ఇప్పిచే ప్రయత్నం చేస్తారన్నారు వెలిచాల రాజేందర్. ఎన్నికల నేపథ్యం లో బండి సంజయ్ చెబుతున్న కట్టు కథలు అని, అశోక్ రావు కి నాకు నలభై ఏళ్ల సాన్నిహిత్యం ఉంది.. ఆయన ఎన్నికల్లో సహకారం చేస్తుంది నిజమేనని ఆయన వెల్లడించారు.

ప్రభాకర్ రావు – అశోక్ రావు వియ్యంకులు అయితే నా నలభై ఏళ్ల స్నేహాన్ని దూరం చేసుకోవాలా అని వెలిచాల రాజేందర్ ప్రశ్నించారు. కానీ ఫోన్ ట్యాపింగ్ నిందితులతో నాకేం సంబంధం లేదని, ఓటమి భయం తోనే బండి సంజయ్ ఇలా నాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మెంటల్ బ్యాలెన్స్ తప్పడం వల్లే సంజయ్ అలా మాట్లాడుతున్నాడని, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ రాజకీయాలు చేసే వ్యక్తి బండి సంజయ్ అని ఆయన విమర్శించారు. 2018 ఎన్నికలకి ఇప్పటికీ సంజయ్ ఆస్తులు ఎలా పెరిగాయని, ఉన్నత విలువలున్న రాజకీయ కుటుంబం నుండి వచ్చానన్నారు. నాకంటే ముందు జీవన్ రెడ్డి ని పార్టీ కరీంనగర్ అభ్యర్ధిగా నిర్ణయించిందని, కానీ ఆయన నిజామాబాద్ పార్లమెంట్ కి వెళ్తా అనడం తో కుల సమీకరణాల కారణంగా నేను బరిలోకి దిగానని ఆయన అన్నారు.

Exit mobile version