Vehicles Smuggling: వికారాబాద్ జిల్లా పరిగి నేషనల్ హైవే 163పై వాహనాల అక్రమ రవాణా చేస్తూ.. పక్క దేశాలకు ఎగుమతి చేయడం మనం చూడవచ్చు. వారం క్రితం ఓ బోర్ వెల్ వాహనాన్ని పట్టుకున్న పరిగి పోలీసులు.. వారం గడవకముందే మరో బోర్ వెల్ వాహనాన్ని పట్టుకున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని., ఆర్టిఏ రోడ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి అర్ధరాత్రి పూట రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇక తాజాగా పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడింది మరో బోర్ బండి లారీ.. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసు స్టేషన్ కు బోర్ బండి లారీని తరలించారు.
Read also: Gold Rate Today: పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?
ఎలాంటి అనుమతులు, పేపర్లు లేకుండా యధేచ్చగా పక్క దేశాలకు ఈ వాహనాలను ఎక్పోర్ట్ చేస్తున్నారు అక్రమ వ్యాపారస్తులు. రోడ్డు మార్గంలో ప్రయాణం ద్వారా కర్ణాటక, షోలేపూర్, ముంబై పోర్టుకు తరలించి.. అక్కడ షిప్ యార్డు నుండి జాంబియాతో పాటు వివిద దేశానికి ఎక్పోర్ట్ చేస్తున్నట్లు సమాచారం అందుకున్నారు. ఇలా బోర్ బండ్ల అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇలా కొన్నేళ్లుగా కొనసాగుతున్న అక్రమదందా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Read also: Ratan Tata : మహారాష్ట్రలో ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు.. జార్ఖండ్‌లో ఒకరోజు సంతాప దినం