Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చమోలి దగ్గర ప్రమాదవశాత్తు 700 మీటర్ల లోయలో బొలెరో వాహనం పడిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం వాహనం జోషిమత్ నుంచి కిమానా వైపు వెళ్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పోలీసు యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తోంది. శుక్రవారం జోషిమఠ్‌లోని పల్లా జఖోలా మోటర్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Jet Airways: షాకిచ్చిన జెట్ ఎయిర్‌వేస్.. 60శాతం ఉద్యోగులు ఇంటికే.. మిగతావారికి కోతలే..!
స్థానిక నివేదికల ప్రకారం, కొందరు వ్యక్తులు వాహనం పైకప్పుపై కూడా కూర్చున్నారు, ఇది ఓవర్‌లోడింగ్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అభిరప్రాయపడుతున్నారు. వాహనం పైకప్పుపై కూర్చున్న వారు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని, అయితే ప్రమాదం తీవ్రతను, లోయ లోతును చూస్తుంటే వాహనం లోపల కూర్చున్న ప్రయాణికులు బతికే అవకాశాలు లేవన్నారు. పై రోడ్డు నుంచి వాహనం కనిపించడం లేదు, రెస్క్యూ టీమ్‌లు కిందకు దిగుతున్నాయి. వాహనంలో 12 నుంచి 13 మంది వరకు ఉన్నట్లు స్థానికుల సమాచారం. గత మూడు రోజుల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది మూడోది.
