NTV Telugu Site icon

Vegetable Juice : శరీరంలోని కొవ్వును తగ్గించాలంటే ఈ వెజిటేబుల్ జ్యూస్ తాగాల్సిందే..

Vegitable Juice

Vegitable Juice

Vegetable Juice : ప్రస్తుతరోజులలో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా కొలెస్ట్రాల్ ( Cholesterol) పెరగడం వల్ల చాలా మంది గుండె జబ్బులు, గుండెపోటు లేదా రక్తనాళాల లోపలి ప్రాంతాల్లో కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం లాంటివి ఎక్కువ చోటు చేసుకున్నాయి. దీనితో శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల చర్మం, కళ్లు, ఇతర అవయవాలు ఒక్కక్కటిగా వరుసగా దెబ్బతింటాయి. కాబ్బటి చాలా వరుకు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అందుకే., కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకునేందుకు వ్యాయామంతోపాటు.. మంచి ఆహారం కూడా మనం తీసుకోవాలి.

Fake Certificates : ఎలాంటి ఆధారాలు లేకుండానే కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు.. గుట్టురట్టు..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజల గుండె ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. అంతేకాకుండా 40 ఏళ్లలోపు వారిలో గుండె పోటు వంటి సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ముందుగా ఛాతీలో నొప్పి లాంటి లక్షణాలు కనపడతాయి. అంతేకాకుండా., ఇది ఊబకాయం, గుండెపోటు బారిన పడేలా చెస్తుంది. ఇలా శరీరంలో పేరుకపోయిన చెడు కొలెస్ట్రాల్‌ ను శుభ్రపరచడంలో టమోటాలు చాలా సహాయ పడుతాయి. టమోటాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా.. టమోటా రసం తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ ను కూడా సులువుగా తగ్గించుకోవచ్చు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ రూ. 93.80 కోట్లు.. విజేత భారత్‌కు ఎంతంటే?

కొన్ని అధ్యయనాల ప్రకారం., ప్రతిరోజూ ఒక కప్పు (సుమారు 240 మి.లీ) టమోటా రసం తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను 10% తగ్గవచ్చు అంట. అలాగే టొమాటోలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన లైకోపీన్, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా కీలక పాత్ర పోషిస్తాయి. ఇక మంచి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నాయి. అయితే.. ఎక్కువగా ఈ టమోటా రసం మాత్రం తాగకూడదు. ఇప్పడు మనం టమోటా రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించడానికి తాజాగా టొమాటోలను కొద్దిగా నీటితో కలిపి.. బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ టమోటా రసం తాగేటప్పుడు ఉప్పు, పంచదార లాంటివి ఏమీ కలపకూడదని తాగాలని అన్నారు. అంతేకాకుండా.. టమాటా సూప్ లాంటివి తాగడం మంచిదేనట.

Health benefits