Veera Dheera Sooran :భారీ సెట్లో విక్రమ్ సినిమా షూటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ విలక్షణ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. తెలుగులో కూడా ఆయనకు మార్కెట్ ఎక్కువగానే ఉంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా మరో భారీ సినిమాలో నటిస్తున్నాడు.. విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’..
విక్రమ్ 62 వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. భారీ సెట్లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది.. రీసెంట్గా విడుదలైన టైటిల్ టీజర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తెన్ కాశీలో భారీ సెట్ వేసి సినిమాను పూర్తి చేస్తున్నారు మేకర్స్.. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు..
Also Read
విక్రమ్ ఇప్పటి వరకు సరికొత్త పాత్రలో నటిస్తూ వచ్చాడు.. ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ రోల్లో విక్రమ్ అలరించబోతున్నారు. ఆయన లుక్ మాస్, రగ్డ్గా ఉంది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ లో విక్రమ్ కాళి పాత్రలో నటిస్తున్నాడు.. సిద్ధికీతో పాటు ఎస్.జె.సూర్య, దుసరా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదల కాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
-
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
-
Sukhbir Singh Badal: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై దాడి
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!