NTV Telugu Site icon

Paris Olympics 2024 : చరిత్ర సృష్టించి మను భాకర్,రబ్జోత్ సింగ్.. మను ఖాతాలో మరో పతకం

Manu Bhaker (2)

Manu Bhaker (2)

వావ్ మను భాకర్, వావ్ సరబ్జోత్ సింగ్… వీరిద్దరూ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మను భాకర్, సరబ్జోత్ సింగ్.. ఓహ్ యే జిన్, లీ వోన్హోలను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరూ 16-10 తేడాతో ఈ పోరులో విజయం సాధించారు. పారిస్ ఒలింపిక్స్ 2024 నాలుగో రోజు అభిమానుల కళ్లు మరోసారి మను భాకర్‌పై పడ్డాయి.

READ MORE: CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..

ఆమె ఈరోజు (జూలై 30) 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్‌లో భారతదేశానికి చెందిన సరబ్జోత్ సింగ్‌ తో కలిసి ఆడేందుకు వచ్చింది. అంతకుముందు, పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ షూటర్‌గా నిలిచింది. మను ఫైనల్‌లో మొత్తం 221.7 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా..ప్రస్తుతం రెండో పతకం వచ్చింది. అలాగే, ఒలింపిక్స్‌ చరిత్రలో షూటింగ్‌లో భారత్‌కు ఇది ఐదో పతకం.