Site icon NTV Telugu

Vasireddy Padma Resign: ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా.. కారణం అదేనా..?

Vasireddy Padma

Vasireddy Padma

Vasireddy Padma Resign: ఎన్నికల తరుణం కావడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పరిణామం జరిగినా.. అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.. అసలే రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి.. సీటు ఆశించి.. అది దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తు్న్నారు. అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చివరకు మంత్రులు కూడా ఉన్నారు.. అయితే, ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ.. ఆ పదవికి రాజీనామా చేశారు. అసలు.. ఎన్నికల ముందు ఆ పదవికి వాసిరెడ్డి పద్మ ఎందుకు రాజీనామా చేశారు అనే చర్చ మొదలైంది..

Read Also: Rana Naidu: రానా నాయుడు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

ఇక, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. తన రాజీనామా లేఖను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సమర్పించారు. అయితే, ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నట్టు సీఎం జగన్‌ను చెప్పినట్టుగా తెలుస్తోంది.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పని చేయడానికి సిద్దమన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు వాసిరెడ్డి పద్మ.. కాగా, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యేవారు పద్మ.. వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ పదవి దక్కించుకున్నారు.. ఆ పదవిని కూడా సమర్థవంతంగా నిర్వహించారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.. గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడిన ఆమె.. ఈ సారి అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, ఈ సారి కూడా టికెట్‌ దక్కే అవకాశం లేదనే సంకేతాలు వెళ్లాయట.. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆమె రాజీనామా చేయడం చర్చగా మారగా.. రాజీనామాకు.. సీటుకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని.. ఎన్నికల సమయంలో ప్రజలతో మమేకం కాలేకపోతున్నానని.. ఇదే సమయంలో ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నానని.. అందుకే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు.. మరోసారి వైఎస్‌ జగన్‌ను సీఎంను చేసేందుకు తన రాజీనామా అంటున్నారు వాసిరెడ్డి పద్మ.

Exit mobile version