Site icon NTV Telugu

Vasamshetti Subash : ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

Vasamshetti Subhash

Vasamshetti Subhash

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదం గురించి మంత్రి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమ అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. ఎన్టిటిపిఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని బాధితులకు అండగా ఉంటామన్నారు.

 

గత ఐదేళ్లలో జరిగిన దురాగతలు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణమన్నారు. నట్టు బోల్టు మార్చడానికి కూడా పది రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు బూడిద దోచుకొని ఇబ్రహీంపట్నాన్ని బూడిదపట్నంగా మార్చారని ఆయన విమర్శించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్ల పని చేసేది సీఈ స్థాయి అధికారులను శాసిస్తున్నాడని, క్వాలిటీ బూడిదను లోపల రాల్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారన్నారు. బూడిద చెరువులో బూడిద అమ్ముకొని కోట్లు దండుకున్నారని మంత్రి సుభాష్‌ అన్నారు.

Exit mobile version