NTV Telugu Site icon

Minister Vasamsetti Subhash: బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్.. కార్మికుల కష్టాలు తీరుస్తా

Vasamsetti Subhash

Vasamsetti Subhash

Minister Vasamsetti Subhash: ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మరికొందరు మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించగా.. మిగతావారు కూడా బాధ్యతలు స్వీకరించే పనిలోపడిపోయారు.. ఇక, ఈ రోజు సచివాలయంలోని 5వ బ్లాక్ లో వేద పండితులు ఆశీర్వచనాల మధ్య కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తాం అన్నారు. కార్మిక శాఖలో ఒక కార్మికుడిలా పని చేస్తా.. కార్మికుల హక్కుల పరిరక్షిస్తా.. కార్మికుల కష్టాలు తీరుస్తా అన్నారు..

Read Also: Balkampet Yellamma: జూలై 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. 81 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే..

ఇక, వైసీపీ ప్రభుత్వం 2019 నుండి 1.25 కోట్ల మంది కార్మికులకు మాత్రమే బీమా సదుపాయం కల్పించింది.. కానీ, చంద్రన్న పాలనలో కార్మికులు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. వైసీపీ పాలనలో కార్మికులకు చెందాల్సిన మూడువేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు.. కార్మికుల సంక్షేమం వైసీపీ పట్టించుకోలేదన్న ఆయన.. 13 పథకాల రద్దు ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇసుక లభ్యత లేక పోవడంతో భవన నిర్మాణ కార్మికులు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.