Operation Valentine: నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!

Operation Valentine Poster

Operation Valentine Poster

Operation Valentine Movie Nizam Rights Goes to Mythri Movie Makers: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తాజాగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్‌ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్, సందీప్‌ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్‌ వేడుక కూడా నిర్వహించింది.

Also Read: IND vs ENG 4th Test: విజయానికి 152 పరుగులే.. భారత్‌కు అంత ఈజీ కాదు!

×
×
Ad

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమా బిజినెస్ స్టార్ట్ అయ్యింది. అందులో భాగంగా నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. భారీ ధరకే ఈ రైట్స్ కొన్నట్లు టాక్. సలార్, హనుమాన్ చిత్రాల నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలు ఎన్ని లాభాలను తెచ్చిపెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నైజాంలో మొన్నటివరకు దిల్ రాజు హవా నడిచిన విషయం తెలిసిందే.