NTV Telugu Site icon

Varun Tej : ఒక్క మాటతో ఓజీ సినిమాపై అంచనాలను డబుల్ చేసిన వరుణ్ తేజ్

Pavan Kalyan Varun Tej

Pavan Kalyan Varun Tej

Varun Tej : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధుల నిర్వహణలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి అనే సినిమాలకు కమిట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టిన తర్వాత భీమ్లా నాయక్, బ్రో అనే సినిమాలను మొదలు పెట్టి వాటిని పూర్తి చేసి విడుదల కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని పవన్ మొదలు పెట్టి కూడా చాలా కాలమే అవుతోంది. వాటితో పాటే ఓజీ మూవీకి కూడా మూహూర్తం పెట్టి చాన్నాళ్లే అవుతుంది.

Read Also:Ratan Tata: రతన్ టాటా ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చేరిక

ఇలా ఈ మూడు సినిమాలను మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ కావడంతో అవి కాస్త సైడ్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పవన్ కళ్యాణ్ తిరిగి మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ , ఓజి ఈ మూడు సినిమాల్లో కూడా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

Read Also:Tirumala Garuda Seva: రేపు గరుడ వాహన సేవ.. ఇవాళ్టి నుంచే ఆంక్షలు..

అందుకు ప్రధాన కారణం.. ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం. దానికి తమన్ అద్భుతమైన బ్యా గ్రౌండ్ స్కోర్ ను అందించారు. వరుణ్ తేజ్ తాజాగా మట్కా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర బృందం తాజాగా ఓ ఈవెంట్ ను నిర్వహించింది. అందులో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. సుజిత్ నాకు ఒక సమయంలో ఆ సినిమా కథను చెప్పాడు. అది నాకు అద్భుతంగా నచ్చింది. సినిమా వచ్చింది అంటే బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఓజి మూవీ గురించి వరుణ్ తేజ్ చెప్పడంతో ఈ సినిమాపై అభిమానులలో అంచనాలు ఒక్క సారిగా పెరిగిపోయాయి.

Show comments