NTV Telugu Site icon

Matka Trailer: నేనేం ద్రోణాచార్యను కాను.. వరుణ్ తేజ్ మట్కా ట్రైలర్ చూశారా ?

Matka

Matka

Matka Trailer: మెగా ఫ్యామిలీలో ప్రయోగాత్మక సినిమాలతో జనాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు ఇలాంటి స్టోరి మనం ఇంతకు ముందెప్పుడూ చూడలేదే అనేంత కొత్త కాన్సెప్ట్‌తో వస్తుంటాడు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఆడియెన్స్‌కు మాత్రం వరుణ్ తేజ్ సినిమాలు మాత్రం సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంటాయి. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేశాడు వరుణ్ తేజ్. తొలి సినిమాకే పొలిటికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్‌తో వచ్చాడు. సినిమా పెద్దగా ఆడకపోయినా కానీ.. వరుణ్‌లో టాలెంట్ ఉందని మాత్రం నిరూపితమైంది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ అంటూ మరో యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను పక్కనబెడితే, నటుడిగా మాత్రం వరుణ్ కు వందకు వంద మార్కులు పడ్డాయి.

Read Also:Karthika Mahotsavam 2024: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. పెరిగిన రద్దీ

దీంతో ఆయన సినిమాల పై జనాలకు ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం మట్కాపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇటీవల విడుదలైన తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ గెటప్‌లు, నటనలో వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రానికి కరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. వేలు తీసుకుని వదిలేయడానికి నేనేం ద్రోణాచార్యను కాను.. మట్కా కింగ్ అంటూ చెప్పే డైలాగ్ అదుర్స్స అనిపించింది. నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానున్న మట్కా చిత్రం.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి , నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Also:Vinod Kumar: బండి సంజయ్ గారూ.. తిట్ల పురాణం పక్కన పెట్టి రహదారిని విస్తరిస్తే మంచిది..

Show comments