NTV Telugu Site icon

Varun Tej: పెళ్లి తరువాత బన్నీ, చరణ్ ఎలా మారిపోయారో చెప్పిన వరుణ్ తేజ్

Varun

Varun

Gaandeevadhari Arjuna: వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గాంఢీవదారి అర్జున. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బుల్లెట్ లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఇక వరుణ్ తేజ్ ను కూడా పలు ఆసక్తికరమైన విషయాలపై ప్రశ్నలు అడిగారు సుమ. దాంట్లో పెళ్లి తరువాత రామ్ చరణ్, బన్నీలో ఎవరు మారిపోయారు అని అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మొదట సందేహించిన వరుణ్ వాళ్లనే అడిగితే బాగుంటుందని అన్నాడు.

Also Read: Naveen Polisetty: అనుష్క సెట్ కి రాగానే టెక్నీషియన్స్ తో అలా చేస్తుంది: నవీన్ పొలిశెట్టి

మొత్తానికైతే తరువాత మాత్రం ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాడు. పెళ్లైతే ఎవరైనా మారిపోవాల్సిందే. పెళ్లాలు చెప్పింది నోరు మూసుకొని వినాల్సిందే అని సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా ఎఫ్ 2 లో కూడా అనిల్ రావిపూడి తమకు అదే నేర్పించాడని తెలిపిన వరుణ్ నిజ జీవితంలో కూడా దానిని ఫాలో అయిపోవడం మంచిదని పేర్కొ్న్నాడు. ఇక మెగా హీరో వరణ్ తేజ్ త్వరలో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ విహహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఈ ఏడాది చివరిలో జరగబోతుంది. ఇక వరుణ్ తేజ్ సమాధానం విన్నవారు లావణ్య త్రిపాఠి చాలా లక్కీ అని కామెంట్ చేస్తున్నారు. పెళ్లికి ముందే వరణ్ తేజ్ భార్య మాట వినాలని డిసైడ్ అయిపోయాడని ఈ విషయంలో లావణ్య చాలా అదృష్టవంతురాలు అని అంటున్నారు. వాళ్లిందరు వివాహం తరువాత హ్యాపిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక సుమ మరో ఆసక్తికరమైన ప్రశ్న కూడా వరుణ్ ను అడిగింది. లావణ్య, నిహారిక నుంచి అర్జెంట్ గా కాల్ చేయి అని ఒకేసారి మెసేజ్ వస్తే మొదట మీరు ఎవరికి చేస్తారు అని ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు వరుణ్ ఏమాత్రం తడుముకోకుండా వెంటనే నిహారికకు కాల్ చేస్తాను తను చిన్న పిల్ల అని సమాధానం చెప్పాడు. దీంతో చెల్లెలు అంటే వరుణ్ కు ఎంత ప్రేమో అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక ఎఫ్ 3, గని సినిమాలు నిరసపర్చడంతో గాంఢీవధారి అర్జున సినిమాపై వరణ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. దీంతో ఎట్లాగైన హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు.

Show comments