NTV Telugu Site icon

Varun Dhawan: సిటడెల్‌లో సెమీ న్యూడ్‌ సీన్‌.. నెటిజన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!

Varun Dhawan Semi Nude

Varun Dhawan Semi Nude

వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వచించారు. రుస్సో బ్రదర్స్‌ నిర్మించిన ఈ సిరీస్‌లో కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మజుందార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌లో హీరో వరుణ్‌ ధావన్‌ సెమీ న్యూడ్‌లో కనిపించారు. ఆ సన్నివేశంపై ఓ నెటిజన్‌ ఫన్నీ పోస్ట్‌ పెట్టగా.. వరుణ్‌ కూడా సరదాగా రిప్లై ఇచ్చారు.

‘సిటడెల్‌లో నేను మూడు ఎపిసోడ్‌లను చూశాను. సిరీస్ చాలా బాగుంది. వరుణ్‌ ధావన్‌, సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్‌ ఇరగదీశాడు. అయితే వరుణ్‌ని చూస్తే మాత్రం నాకు కాస్త బాధగా ఉంది. ఎందుకంటే.. ప్రతి డైరెక్టర్ వరుణ్‌ను నగ్నంగా చూపిస్తున్నారు’ అని ఓ నెటిజన్‌ పోస్ట్‌ పెట్టాడు. ‘ఈ సిరీస్‌లో నేను ఎక్కువగా పూర్తిగా డ్రెస్‌ వేసుకున్నాను. అది కూడా చూడండి మీరు’ అంటూ నెటిజన్‌కు ఫన్నీగా వరుణ్‌ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్ట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న సిటడెల్‌ వెబ్‌ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలీవుడ్‌, టాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇన్‌స్టా, ఎక్స్ వేదికగా సమంత అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరోవైపు వరుణ్‌ ధావన్‌ కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రిప్లైలు ఇస్తున్నారు. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ అన్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌లో రెండో సీజన్‌ కూడా ప్రారంభమైంది.

 

 

Show comments