Varun Dhawan: సిటడెల్‌లో సెమీ న్యూడ్ సీన్.. నెటిజన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిటడెల్
- సెమీ న్యూడ్‌లో కనిపించిన హీరో
- ఫన్నీ పోస్ట్ పెట్టిన నెటిజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వచించారు. రుస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్లో హీరో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్‌లో కనిపించారు. ఆ సన్నివేశంపై ఓ నెటిజన్ ఫన్నీ పోస్ట్ పెట్టగా.. వరుణ్ కూడా సరదాగా రిప్లై ఇచ్చారు.
‘సిటడెల్‌లో నేను మూడు ఎపిసోడ్లను చూశాను. సిరీస్ చాలా బాగుంది. వరుణ్ ధావన్, సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్ ఇరగదీశాడు. అయితే వరుణ్ని చూస్తే మాత్రం నాకు కాస్త బాధగా ఉంది. ఎందుకంటే.. ప్రతి డైరెక్టర్ వరుణ్‌ను నగ్నంగా చూపిస్తున్నారు’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ‘ఈ సిరీస్‌లో నేను ఎక్కువగా పూర్తిగా డ్రెస్ వేసుకున్నాను. అది కూడా చూడండి మీరు’ అంటూ నెటిజన్‌కు ఫన్నీగా వరుణ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్ట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
Also Read: SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న సిటడెల్ వెబ్ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇన్‌స్టా, ఎక్స్ వేదికగా సమంత అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరోవైపు వరుణ్ ధావన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రిప్లైలు ఇస్తున్నారు. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ అన్న విషయం తెలిసిందే. హాలీవుడ్లో రెండో సీజన్ కూడా ప్రారంభమైంది.
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..