NTV Telugu Site icon

Varshini : ఆ దర్శకుడు నా తో అసభ్యంగా ప్రవర్తించాడు

Whatsapp Image 2023 08 10 At 11.31.20 Am

Whatsapp Image 2023 08 10 At 11.31.20 Am

వర్షిణి.. ఈ భామ బుల్లితెరపై యాంకర్ గా బాగా పాపులరిటి తెచ్చుకుంది. ఈ భామకు ఢీ షో ద్వారా మంచి క్రేజ్ లభించింది. వరుస అవకాశాల కోసం ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.తన హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. అటు వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ భామ వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు దక్కించుకోవడానికి కొన్ని ఆడిషన్స్ కు కూడా వెళ్తుంటుంది.ఆ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది.వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరై క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది.ఆ సమయంలో తను అనుభవించిన బాధను వివరించే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ కు ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది.ఆ వెబ్ సిరీస్ తెరకెక్కించే డైరెక్టర్ అడిషన్స్ కోసం హోటల్‌కు రమ్మంటే వెళ్లాను.. ఆడిషన్ అయిపోయిన తరువాత అంతా సూపర్ అని ఆయన నాతో అన్నారు.ఆ తరువాత ఆ దర్శకుడు నువ్వు బాగున్నావు.. ఈ వెబ్ సిరీస్ కు బాగా సూట్ అవుతావు అని చెప్పడంతో ఇక అందులో నటించవచ్చు అని నేను అనుకున్నాను. కాని ఆ తరువాత అతను తనతో పాటు గదిలోకి రమ్మని పిలిచాడు.అక్కడ నా చేయి పట్టుకుని బెడ్ పైకి లాగే ప్రయత్నం  చేశాడు. నా డ్రెస్ విప్పమంటూ బలవంతం చేసాడని షాకింగ్ కామెంట్స్ చేసింది వర్షిణి. ఆ సమయంలో నేను ఎంతగానో భయపడ్డాను అతన్ని విడిపించుకుని.. బయటకు వచ్చేశాను.ఆ తరువాత అక్కడి జరిగింది తలుచుకుని చాలా సేపు ఏడ్చాను.. నా జీవితంలో అది ఒక భయంకరమైన సంఘటన అంటూ వర్షిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వర్షిణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి

Show comments