Site icon NTV Telugu

Varshini Sounderajan : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ వర్షిణి.. ఫోటోలు వైరల్..

Varshini

Varshini

యాంకర్ గా బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు.. సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అడపాదడపా వెండితెరపై మెరుస్తూ ఆకట్టుకుంటుంది.. నిధానంగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణిస్తుంది. ఇటీవల రెండు చిత్రాలతో మెరిసిన ఈ భామ మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తాజాగా వర్షిణి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.. శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం ఉదయాన్నే ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం బయట దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.. ట్రెడిషనల్‌ లుక్ లో మెరిసిపోతుంది వర్షిణి. ఆమె ఎల్లో డ్రెస్‌ ధరించింది. మేకప్‌ లేకుండా కనిపించడం విశేషం. ఒరిజినల్‌ అందంతో కట్టిపడేస్తుందీ హాట్ యాంకర్‌.. మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉంది.. ఈ ఫోటోలను చూసిన వారంతా కూడా చాలా బాగున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ఇక కేరీర్ విషయానికొస్తే.. ఈ అమ్మడు మోడల్ గా కెరియర్ ను స్టార్ట్ చేసింది.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. `చందమామకథలు` చిత్రంలో రేణు పాత్రలో మెరిసింది. ఇది మంచి గుర్తింపే తెచ్చింది. ఆ తర్వాత `లవర్స్`లోనూ కనిపించింది. `బెస్ట్ యాక్టర్స్`, `శ్రీరామ రక్ష` వంటి చిత్రాలు చేసింది. కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.. ఆ తర్వాత యాంకర్ గా రానిస్తూ పలు షోలు చేసింది..ఇటీవల సినిమాలతో బిజీ అవుతుంది. `మళ్లీ మొదలైంది`, సమంత నటించిన `శాకుంతలం`లో ఆమెకి సహాయకురాలిగా, అలాగే `భాగ్‌ సాలే`లో సత్యకి వైఫ్‌గా నటించి మెప్పించింది.. ఇంకా పలు సినిమాలకు సైన్ చేసింది..

Exit mobile version