Site icon NTV Telugu

Varanas : పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?

Varanasi

Varanasi

టాలీవుడ్ దిగ్గజ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ (Varanasi) అప్పుడే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ‘ఎనౌన్స్ మెంట్ టీజర్’ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ టీజర్‌ను పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్‌’ (Le Grand Rex) థియేటర్‌లో ప్రదర్శించబోతున్నారు. ఇలా పారిస్‌లో గ్రాండ్‌గా టీజర్ లాంచ్ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ చరిత్ర సృష్టించబోతోంది. కాగా,

ఈ చారిత్రాత్మక ప్రదర్శన జనవరి 5, 2026న (ఈరోజు) రాత్రి 9 గంటలకు జరగనున్నట్లు ఫ్రెంచ్ పంపిణీ సంస్థ ‘ఆన్నా ఫిల్మ్స్’ అధికారికంగా ప్రకటించింది. పెద్ద తెరపై అత్యున్నత సాంకేతికతతో ఈ టీజర్‌ను అభిమానుల ముందుకు తీసుకురానున్నారట. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను, దేవా కట్టా మాటలను సమకూరుస్తున్నారు. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్న రాజమౌళి, ఈ టీజర్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో శాంపిల్ చూపించబోతున్నారు.

Exit mobile version